గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటి సోఫీ టర్నర్, జోయ్ జోనస్ పెళ్లి చేసుకున్నారు. అమెరికా లాస్వేగాస్లో ఒక్కటై అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ వివాహ వేడుకకు జోయ్ సోదరులు కెవిన్, నిక్ జోనస్ హాజరయ్యారు. 2017 అక్టోబరులోనే సోఫి, జోయ్ నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం వీరి వివాహానికి అనుమతి పత్రం(వెడ్డింగ్ లైసెన్స్) లభించింది. ప్రస్తుతం వీరి వివాహ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
జోయ్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సాన్సా - sophi
హాలీవుడ్ నటి సోఫీ టర్నర్, అమెరికన్ గాయకుడు జోయ్ జోనస్ లాస్వేగాస్లో పెళ్లి చేసుకున్నారు. తక్కువ మంది అతిథుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటై అందరిని ఆశ్చర్యపరిచారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్‌లో 'సాన్సా స్టార్క్' పాత్ర ద్వారా సోఫీ సుపరిచితం.
సోఫీ
'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టీవీ సిరీస్‌లో 'సాన్సా స్టార్క్' పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకుంది సోఫీ. గాయకుడైన జోయ్ తన సోదరులతో కలిసి 'జోనస్ బ్రదర్స్' పేరుతో ఆల్బమ్ సాంగ్స్‌ను రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ బ్రదర్స్‌లో ఒకరైన నిక్ జోనస్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే.