బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న 'సూర్యవంశీ' విడుదల తేదీ ముందుకు జరిగింది. మార్చి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటే ఓ సరికొత్త ప్లాన్‌తో ముందుకు వస్తోంది చిత్రబృందం. ముంబయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ నుంచి మూడు రోజుల పాటు 24x7 ప్రదర్శించనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్నే చెబుతూ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు దర్శకుడు రోహిత్ శెట్టి.
మూడు రోజులపాటు ప్రత్యేక ప్రదర్శనలు
ఈ వీడియోలో కొందరు పిల్లలు, రణ్వీర్ సింగ్ దగ్గరకు వచ్చి నిద్రలేపి మరీ ఈ విషయాన్ని చెబుతారు. అజయ్ దేవగణ్కూ ఇదే విషయం చెబుతారు. హీరో అక్షయ్కూ ఈ విషయమే చూపిస్తారు. చివరగా పిల్లలందరూ పాప్‌కార్న్ డబ్బాలు పట్టుకొని థియేటర్‌కు వెళుతూ కనిపిస్తుంటారు.
భారతదేశ తొలి పోలీస్(కాప్) యూనివర్స్ 'సూర్యవంశీ'. ఇందులో కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్, అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చూడండి..'ఇప్పటికీ శుక్రవారం అంటే నాకు భయమే'