తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడు రవీనా.. ఇప్పుడు కత్రినా

90 దశకంలో(tip tip barsa pani sooryavanshi) కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బాలీవుడ్‌ సాంగ్‌ 'టిప్‌ టిప్‌ బర్‌సా పానీ'. అప్పట్లో ఈ పాటకు అక్షయ్​కుమార్​తో కలిసి రవీనా టాండన్​ చిందులేసి యువతకు నిద్రలేకుండా చేసింది. ఇప్పుడు అదే గీతానికి అక్షయ్​తో కలిసి కాలు కదిపింది కత్రినా కైఫ్​. ఇది కూడా యూత్​ను బాగా ఆకర్షిస్తోంది. ఆ రెండు వీడియోలను చూసేయండి..

akshay
అక్షయ్​

By

Published : Nov 7, 2021, 2:33 PM IST

Updated : Nov 7, 2021, 3:30 PM IST

ఒక చిత్రంలో(tip tip barsa pani remix) విజయవంతమైన పాటను రీమిక్స్‌ చేసిన కొత్త చిత్రంలో వాడుకోవటం అన్ని భాషల్లోనూ చూస్తుంటాం. గతంలో తెలుగులో వచ్చిన పాటలెన్నో రీమిక్స్‌ అయ్యాయి. అవుతున్నాయి. 90 దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బాలీవుడ్‌ సాంగ్‌ 'టిప్‌ టిప్‌ బర్‌సా పానీ'. అక్షయ్‌కుమార్‌, రవీనా టాండన్‌ జంటగా నటించిన 'మోహ్ర' చిత్రంలోని ఈ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. పసుపు రంగు చీరలో రవీనా వానలో తడుస్తూ అందాలను ఒలకబోస్తుంటే, ఆ వయ్యారాల ఒంపులు చూసి అందులో హీరో అక్షయ్‌ మాత్రమే కాదు, తెరపై సినిమా చూస్తున్న యువత కూడా పిచ్చెక్కిపోయారు.

ఇప్పుడు అదే పాటను అక్షయ్‌ కుమార్‌, కత్రినాకైఫ్ జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సూర్యవంశీ' కోసం రీమిక్స్‌ చేశారు సంగీత దర్శకుడు తనీష్‌ బాగ్చి. రోహిత్‌శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం 'టిప్‌ టిప్‌ బర్‌సా పానీ' పాటను రీమిక్స్‌ చేశారు. ఫరాఖాన్‌ నృత్యాలు సమకూర్చారు. అప్పట్లో రవీనా తళుకు బెళుకులకు ఏమాత్రం తీసిన పోని విధంగా కత్రినా అదరగొట్టేసింది(tip tip barsa pani katrina kaif ). అప్పటి యువత పరిస్థితి ఏంటో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం కత్రినా డ్యాన్స్‌, అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ పాటనూ, అప్పట్లో రవీనా పాటను రెండింటినీ చూసేయండి.

ఇదీ చూడండి: మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా.. హాట్​గా అమైరా

Last Updated : Nov 7, 2021, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details