తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేను ఏ మతాన్ని నమ్మను.. భారతీయుడిని అంతే' - Akshay Kumara movies

అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సూర్యవంశీ. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్​లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అక్షయ్.

అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్

By

Published : Mar 9, 2020, 8:29 PM IST

దేశంలోని ఎంతో మందికి బతుకుతెరువు చూపుతుంది ముంబయి మహానగరం. అలాంటి నగరంపై ఉగ్రమూకలు కన్నేశారు. వారి నుంచి ఆ మహానగరాన్ని రక్షించాలి. ఉగ్రవాదుల భరతం పట్టాలి. అటువంటి పాత్రలోనే 'సూర్యవంశీ' చిత్రంతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్షయ్‌ కుమార్‌. దీని గురించి మాట్లాడుతూ ఈ హీరో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

"నేను ఏ మతాన్నీ నమ్మను. నేను భారతీయున్ని మాత్రమే. ఇదే నా సరికొత్త సినిమాలో కనబడుతుంది. భారతీయుడిగా ఉండటం అంటే పార్శిగానో, హిందువుగానో, ముస్లింగానో ఉండటం కాదు. నేను దాన్ని ఆసలు మతం కోణంలో చూడనే చూడను"

-అక్షయ్‌ కుమార్, బాలీవుడ్ హీరో

'సూర్యవంశీ' చిత్రానికి రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్షయ్‌.. ఏటీఎస్‌ అధికారి వీర్‌ సూర్యవంశీ పాత్రలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడనున్నాడు.

ABOUT THE AUTHOR

...view details