వచ్చే ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల స్క్రీనింగ్‌లో దక్షిణాది నుంచి మూడు సినిమాలకు అవకాశం దక్కింది. వాటిలో సూర్య 'సూరరై పోట్రు'(ఆకాశం నీ హద్దురా!), ధనుష్ 'అసురన్', 'జల్లికట్టు' ఉన్నాయి. ఈ ఈవెంట్ లాస్ ఏంజెల్స్‌లో జరగనుంది.
'గోల్డెన్ గ్లోబ్స్' స్క్రీనింగ్‌లో ఆ మూడు సినిమాలు - 'Asuran' Golden Globes 2021
78వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల స్క్రీనింగ్‌కు దక్షిణ భారత్ నుంచి మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. వీటిలో సూర్య, ధనుష్ సినిమాలు ఉండటం విశేషం.
'గోల్డెన్ గ్లోబ్' స్క్రీనింగ్‌లో ఆ మూడు సినిమాలు
వీటితో పాటు మన దేశానికి చెందిన 'ఈహ్ అల్లే ఓ!', 'హరామీ', 'తాన్హాజీ', 'ద డిసిపిల్', 'లూడో', 'జస్ట్ లైక్ దట్', 'ట్రీస్ అండర్ ద సన్' సినిమాలనూ అక్కడ ప్రదర్శించనున్నారు.
స్క్రీనింగ్ కోసం మొత్తంగా 77 దేశాల నుంచి 139 సినిమాలు ఎంపికయ్యాయి. వీటిలో 37 సినిమాలకు దర్శకులు లేదా సహాయ దర్శకులుగా మహిళలు ఉండటం విశేషం.