తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్​తో గొడవల్లేవ్.. దిశ ఎవరో తెలియదు' - సూరజ్​ పంచోలీ లేటెస్ట్ న్యూస్​

బాలీవుడ్​ హీరో సుశాంత్​ రాజ్​పుత్​ మాజీ మేనేజర్​ దిశా శాలిన్​ మృతితో తనకు సంబంధం ఉందన్న వార్తలను ఖండించాడు నటుడు సూరజ్​ పంచోలీ. ఆమె ఎవరో తనకు తెలియదని.. సుశాంత్​ మరణం తర్వాత తొలిసారి తన గురించి తెలుసుకున్నానని స్పష్టం చేశాడు​.

Sooraj Pancholi denies claim of expecting child with Sushant's ex-manager, says 'never met Disha Salian in my life'
దిశా ఎవరో నాకు తెలియదు: సూరజ్​ పంచోలీ

By

Published : Jul 5, 2020, 2:28 PM IST

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మాజీ మేనేజర్​ దిశా శాలిన్​ మృతితో తనకు సంబంధం ఉందన్న వార్తలను ఖండించాడు నటుడు సూరజ్​ పంచోలీ. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు గర్భిణి అని.. సూరజ్​ వల్లే దిశ గర్భం దాల్చిందని ప్రచారం జరుగుతోంది​. దిశను అబార్షన్ చేయించుకోవాలని సూరజ్​ సూచించగా.. అందుకు ఇష్టంలేని ఆమె తనువు చాలించిందని బాలీవుడ్​ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సుశాంత్​.. తన మేనేజర్​కు మద్దతు తెలిపాడని తెలుస్తోంది. దిశ మరణించినప్పుడు సూరజ్​ ఆమె ఫ్లాట్​లో ఉన్నాడని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ రూమర్లపై తాజాగా స్పందించాడు సూరజ్​ పంచోలీ. ​

"దిశ ఎవరో నాకు తెలియదు. నా జీవితంలో ఒక్కసారైనా ఆమెను కలవలేదు. సుశాంత్​ మరణం తర్వాత ఆమె గురించి తెలుసుకున్నా. ఈ విషయాల్లో కుటుంబాలను కలపడం కొంచెం బాధగా అనిపించింది. కొంతమంది దీనికి సంబంధించిన విషయాలను సోషల్​మీడియాలో సినిమా స్క్రిప్ట్​లా పోస్టు చేస్తున్నారు. సుశాంత్​ను నా సోదరుడిలా భావించా. మేమిద్దరం ఎప్పుడు కలిసినా సినిమాల గురించి నా ఫిట్​నెస్​ ట్రైనింగ్ గురించి చర్చించేవాళ్లం. 2017లో మా ఇద్దరి మధ్య జరిగిన కొన్ని పరిణామాల గురించి వార్తలు వచ్చినప్పుడు.. సుశాంత్​ స్పందించాడు. ఇలాంటి వార్తల వల్ల సల్మాన్​ తనపై కోపంగా ఉన్నట్లు తెలిపాడు​. దీనిపై స్పష్టత ఇవ్వమని నన్ను అడిగాడు. 'బాంద్రాలో ఓ ఫంక్షన్​లో విందు కోసం కలుసుకున్నాం. అందులో సరదాగా గొడవపడుతున్నట్లు ఉన్న చిత్రాన్ని షేర్​ చేశాం అంతే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు' అని తెలియజేశా. సుశాంత్​ నాకు బెస్ట్​ఫ్రెండ్​ మాత్రమే".

- సూరజ్​ పంచోలీ, బాలీవుడ్​ నటుడు

"సుశాంత్​, దిశ ఆత్మహత్య కేసుల్లో మీ​ ప్రమేయం ఉందా?" అడిగినప్పుడు.."సుశాంత్​ లేడనే వార్త వింటుంటే చాలా బాధగా ఉంది. దీనిపై రకరకాలుగా ప్రచారం జరిగే అవకాశం ఉంది. కొన్ని రోజులు వైరల్​ అవుతాయి. కానీ, వాటన్నింటి కంటే ముందు నిజాన్ని తెలుసుకోండి" అని వెల్లడించాడు సూరజ్​.

ఇదీ చూడండి... హిట్​ కాంబినేషన్లు మళ్లీ రాబోతున్నాయి

ABOUT THE AUTHOR

...view details