1997లో విడుదలై అందర్ని భయపెట్టిన హాలీవుడ్ చిత్రం 'అనకొండ'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లోనే 45 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తే... ఏకంగా 136.8 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమాను సరికొత్త హంగులతో మళ్లీ తెరకెక్కించేందుకు సోనీ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో నటించే నటీనటులతో పాటు దర్శకుడు, నిర్మాత వంటి విషయాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కొత్త హంగులతో 'అనకొండ' మళ్లీ వస్తోంది..! - అనకొండ సినిమా
'అనకొండ' హాలీవుడ్ చిత్రం ఇప్పడు మళ్లీ తెరపైకి రానుంది. ఆధునిక సాంకేతికత జోడించి మరోసారి చిత్రీకరించాలని సోనీ పిక్చర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
కొత్త హంగులతో 'అనకొండ' మళ్లీ వస్తోంది..!
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ఈ సినిమా తీస్తే, భారీగా ఖర్చవుతుందని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'అనకొండ' చిత్రంలో జెన్నిఫర్ లోపేజ్, ఐస్ క్యూబ్, జాన్ వొగిట్, ఇరిక్ స్టాల్జ్, విల్సన్ తదితరులు నటించారు. ఈ సినిమా తర్వాత 'అనకొండ' పేరుతో కొన్ని చిత్రాలు వచ్చినా, అవేవీ ఈ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఇదీ చూడండి.. రెబల్‌స్టార్ సినిమాకు 25 రకాల సెట్టింగ్‌లు..!
Last Updated : Feb 18, 2020, 9:55 AM IST