రియల్‌హీరో సోనూసూద్(Sonu sood fitness) ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సమాజసేవ చేస్తూ దేశప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి మన్ననలు పొందుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఫిట్నెస్ విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే సోనూసూద్ తాజాగా ఓ స్టన్నింగ్ వర్కౌట్ వీడియోను పోస్ట్ చేయగా నెట్టింట్లో అది విపరీతంగా సందడి చేస్తోంది. "ఇది ప్రమాదకరమైన స్టంట్. సరైన శిక్షణ లేకుండా దీన్ని ప్రయత్నించవద్దు" అంటూ హెచ్చరించారు సోను. ఇందులో ఆయన జా డ్రాపింగ్ స్టంట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే చివరికి నవ్వులు పూయించారు. ఆద్యంతం ఈ వీడియో చూసిన నెటిజన్లు తొలుత షాక్ అయినా కెమెరా ట్రిక్ ద్వారా ఇది చేశారని గ్రహించి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. దాన్ని మీరూ చూసేయండి..