కరోనా కష్టకాలంలో అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ హీరో అయ్యారు నటుడు సోనూసూద్. తాజాగా పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఆయన గమనించారు. దీంతో వారిని ఆదుకునేందుకు రంగంలోకి దిగారు. వారందరి కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న, అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని ప్రకటించారు.
విద్యార్థుల కోసం సోనూసూద్ ప్రత్యేక స్కాలర్‌షిప్ - Sonusoodh arranged scholar ships for higher education
ఉన్నత విద్య చదవాలనుకునే వారికోసం ప్రత్యేక స్కాలర్షిప్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నటుడు సోనూసూద్. పది రోజుల్లో విద్యార్థులు తన మెయిల్‌కు వివరాలు పంపించాలని ట్వీట్ చేశారు.

సోనూసూద్
మెడిసిన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్, జర్నలిజం మొదలైన వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దీనికి అర్హులేనని సోనూ తెలిపారు. దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు స్కాలర్షిప్స్ @సోనూసూద్.ఎమ్ఇ(scholarships@sonusood.me) మెయిల్‌కు పది రోజుల్లో తమ వివరాలను పంపించాలని ట్వీట్ చేశారు.