కరోనా కష్టకాలంలో అవసరం ఉన్న వారికి అండగా నిలుస్తూ వస్తున్న నటుడు సోనూసూద్‌కు వినతుల వెళ్లువ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. చాలామంది ఈ నటుడికి సామాజిక మాధ్యమాల ద్వారా వినతులను విన్నవిస్తున్నారు. అయితే ఓ యువకుడు మాత్రం సోనూను కలవడానికి వికారాబాద్ నుంచి ముంబయికి పయనమై వార్తల్లో నిలిచాడు. తాజాగా ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూ.. అతడిని కలిసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
"వెంకటేశ్.. నన్ను కలవడానికి హైదరాబాద్ నుంచి ముంబయి కాలినడకన వచ్చాడు. నేను అతని కోసం ఒక విధమైన రవాణాను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ నిరాకరించాడు. ఇతడు నిజంగా నాకు స్ఫూర్తిగా నిలిచాడు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి ఇబ్బందుల్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను."