ప్రస్తుతం కాంపిటేటివ్ యుగంలో చాలా వ్యయంతో కూడుకున్నది సివిల్స్. ఎంతో మంది ఐఏ ఎస్, ఐపీఎస్ కావాలనుకున్నా.. వారి కుటుంబ ఆర్థిక స్తోమత అందుకు సహకరించకపోవచ్చు. దీంతో వారి ఆశయాన్ని పక్కనపెట్టవచ్చు. తాజాగా అలాంటి వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు నటుడు సోనూసూద్(Sonusood). ఇప్పటికే కరోనా బాధితులతో పాటు వివిధ కార్యక్రమాలతో రియల్ హీరోగా మారిన ఆయన తాజాగా సివిల్స్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు.
Sonusood: సివిల్స్ అభ్యర్థుల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ - సోనూసూద్ సంభవం
పేద సివిల్స్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు నటుడు సోనూసూద్(Sonusood). కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక ఐఏఎస్, ఐపీఎస్ కేడర్‌లో ఉద్యోగాలు సంపాదించాలన్న కోరిక ఉన్నవారి కోసం ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సోనూసూద్
కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్‌పై ఆశ ఉన్నవారి కోసం ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు సోనూసూద్. 'సంభవం' అనే ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం అభర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉచిత స్కాలర్‌షిప్‌తో పాటు సివిల్స్‌లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్గదర్శకత్వం పొందాలనుకునే వారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. soodcharityfoundation.org ద్వారా అప్లికేషన్‌ను పంపాలి.
Last Updated : Jun 11, 2021, 10:58 PM IST