తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా బయోపిక్ తీస్తే నేనే హీరో: సోనూసూద్ - సోనూసూద్ బయోపిక్

లాక్​డౌన్ కాలంలో వేలాది మంది వలస కార్మికులకు దన్నుగా నిలిచాడు నటుడు సోనూసూద్. అయితే సోనూ జీవితాధారంగా ఓ సినిమా చేయాలని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నా బయోపిక్ తీస్తే నేనే హీరో: సోనూసూద్
నా బయోపిక్ తీస్తే నేనే హీరో: సోనూసూద్

By

Published : Jul 18, 2020, 6:40 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో వేల మంది వలస కార్మికులను స్వస్థలాలకు పంపించి.. రీల్ విలన్‌ సోనూసూద్‌ రియల్‌ హీరోగా మారిపోయాడు. లాక్‌డౌన్‌ సమయంలో తనకు ఎదురైన అనుభవాలతో ఓ పుస్తకం రాస్తానని ఇదివరకే సోనూ సూద్‌ వెల్లడించాడు. అయితే తాజాగా సోనూపై ఓ సినిమా కూడా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన సోనూ ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు.

వలస కార్మికుల కష్టాలకు చలించిపోయిన సోనూసూద్‌ వారిని తన సొంత డబ్బుతో ఇళ్లకు చేర్చిన విషయం తెలిసిందే. సోనూ చేసిన సేవలను ప్రజలే కాదు.. ప్రభుత్వాలు సైతం మెచ్చుకున్నాయి. సోనూ అంతటితో ఆగిపోలేదు.. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాడు. సోనూ చేసిన సేవలు, అతడి సహాయం పొందిన వారి వివరాలు.. లెక్కలు అన్నీ రికార్డయి ఉన్నాయి.

దీంతో సోనూ జీవితం ఆధారంగా ఓ సినిమా చేయాలని బాలీవుడ్‌లో కొందరు దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇదే విషయంపై సోనూ స్పందిస్తూ "నిజంగా నా బయోపిక్‌ తీస్తే అందులో నా పాత్రను నేనే పోషిస్తా. ఎందుకంటే నా జీవితంలో ఎదురైన అనుభవాలు నాకన్నా బాగా ఇంకెవరికి తెలుస్తాయి?" అని అంటున్నాడు. అయితే సోనూ పుస్తకం రాసిన తర్వాత సినిమాను తెరకెక్కిస్తారా? రెండూ ఒకేసారి జరుగుతాయా అనేది వేచి చూడాలి.

ABOUT THE AUTHOR

...view details