బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేసిన ఓ మంచి కార్యక్రమం వల్ల పది మందికి పైగా ప్రాణాలు దక్కాయి. ఆయన స్థాపించిన సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్.. కరోనా బాధితుల పట్ల సంజీవినిగా మారింది. ఆక్సిజన్ దొరక్క చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పది మంది వైరస్ రోగులకు సరైనా సమయంలో ఆక్సిజన్‌ను అందించి వారి ప్రాణాలను కాపాడింది.
ఇదీ జరిగింది
కర్ణాటక యెలాహంక దగ్గర్లోని ఆర్కా ప్రైవేట్ ఆస్పత్రిలో పదిమందికి పైగా కరోనా బాధితులు చికిత్స కోసం చేరారు. అయితే చేరిన ఒక్క రాత్రిలోనే ఆక్సిజన్ అందుబాటులో లేక ఇద్దరు బాధితులు కన్నుమూశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది.. అత్యవసరంగా ప్రాణవాయువు కోసం యెలహంక న్యూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించింది. తక్షణమే స్పందించిన అక్కడి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ్, సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ట్రస్ట్ సభ్యులు 11 ఆక్సిజన్ సిలిండర్లను బైక్స్, కార్లు ద్వారా ఆస్పత్రికి తరలించి.. రోగులకు ప్రాణవాయువును సకాలంలో అందించారు. దీంతో పది మందికిపైగా కొవిడ్ బాధితులు చావు నుంచి తప్పించుకున్నారు.
ఇదీ చూడండి: '100 కోట్ల సినిమా కంటే ప్రజాసేవే ముఖ్యం'