కరోనా ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల రీత్యా, ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలువురు వలస కూలీలు. వారిని ఇళ్లకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తనను సంప్రదించాలని కోరిన ఈ నటుడికి.. కొందరు నెటిజన్లు విపరీత కోరికలు అడుగుతున్నారు.
ఇటీవలే ఓ వ్యక్తి మద్యం కావాలని అడగ్గా.. తాజాగా ఓ వ్యక్తి, బిహార్లో ఉన్న తన ప్రేయసి దగ్గరికి వెళ్లేందుకు సాయం చేయమని ట్విట్టర్ వేదికగా విన్నవించాడు. దీనికి సోనూ ఫన్నీగా సమాధానమిచ్చారు. "కొన్ని రోజులు నీ ప్రేమకు దూరంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ నిజమైన ప్రేమకు ఇది పరీక్ష" అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. సదరు నటుడి హాస్య చతురతను ప్రశంసిస్తున్నారు.