తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియోలో నటించారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. గాయని సునంద శర్మ పాడిన 'పాగల్ నహీ హోనా' పాటలో ఆర్మీ అధికారిగా కనిపించారు. రొమాంటిక్గా సాగే ఈ పాటను జానీ రాశారు.
"ఇది నా తొలి మ్యూజిక్ వీడియో. కాన్సెప్ట్ వినగానే తప్పకుండా చేయాలనుకున్నా. 'పాగల్ నహీ హోనా' పాటను జవాన్లు, వారి జీవిత భాగస్వాములకు అంకితమిస్తున్నాం. సునంద చాలా బాగా పాడారు. పాట సాహిత్యం మీ మనసులను హత్తుకుంటుంది."
-సోనూసూద్, బాలీవుడ్ నటుడు