నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్న రియల్ హీరో సోనూసూద్(Sonu Sood).. మాట నిలబెట్టుకున్నారు. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్‌ను(Sonu Sood Oxygen Plant) కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాకు పంపించారు. ఈ ప్లాంట్‌ను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు.
"ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నాను. ప్రాణ వాయువు(ఆక్సిజన్ ప్లాంట్) త్వరలో ప్రారంభం కానుంది. నేను ఎంతగానో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చెయ్యబోతున్నాను".
- సోనూసూద్, నటుడు
గుజరాత్‌లోని ఘజియాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ఆక్సిజన్ ప్లాంట్ సోమవారం ఉదయం 10 గంటలకు నెల్లూరులోని అయ్యప్పగుడి వద్దకు చేరుకుంది. దీనిపై సోనూసూద్ మిత్రుడు సమీర్‌ఖాన్ మాట్లాడుతూ ఆక్సిజన్ ప్లాంట్‌ను జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు చేతుల మీదుగా ఆత్మకూరులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సీఏ స్కాలర్షిప్..
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేసిన నటుడు సోనూసూద్.. పేద విద్యార్ధులకూ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇటీవలే ఐఏఎస్ పరీక్షలకు శిక్షణ తీసుకునే వారికోసం స్కాలర్షిప్ కార్యక్రమాన్ని సోనూ ప్రారంభించారు. ఇప్పుడు సీఏ విద్యను ఉచితంగా అందజేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 'సీఏ దినోత్సవం' సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇందుకోసం soodcharityfoundation.org వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి..Sonu Sood: సోనూసూద్‌ను పూర్తిగా మార్చేసిన ఆ సంఘటన