తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Sonu Sood: 'దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు'

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి తన వంతు సాయం చేస్తూ, మంచి మనసు చాటుకున్నారు సోనూసూద్. ఇటీవల కాలంలో కరోనా సెకండ్ వేవ్​లో ఆక్సిజన్​ లేక చాలామంది మరణిస్తుండటం చూసి చలించిపోయిన ఆయన.. దేశవ్యాప్తంగా 18 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టనున్నట్లు తెలిపారు.

Sonu Sood to set up 18 oxygen plants across various states
సోనూసూద్

By

Published : Jun 10, 2021, 9:51 AM IST

ప్రముఖ నటుడు సోనూసూద్(sonu sood).. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఆక్సిజన్​(OXYGEN) ప్లాంట్లు పెట్టనున్నట్లు హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని నెల్లూరు, కర్నూలు నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్​లో సహా పలు రాష్ట్రాల్లో సోనూ, ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

సోనూసూద్

"గత కొన్నినెలల నుంచి మనం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం. ఈ సమస్యను దాని మూలాల నుంచి నిర్మూలించేందుకు నేను, నా బృందం ఏం చేయాలో ఆలోచించి, వీలైనన్ని ఆక్సిజన్​ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆక్సిజన్ దొరకక దేశంలో ఏ వ్యక్తి చనిపోకూడదు. ఇదే మా లక్ష్యం" అని సోనూసూద్ చెప్పారు.

సోనూసూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) 'ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే తాను ప్రధాన పాత్రలో 'కిసాన్'(Kisaan) సినిమాను ప్రకటించారు. త్వరలో దాని షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details