కరోనా సంక్షోభంలో ఎంతోమందికి సహాయాన్ని అందించి రియల్ హీరోగా మన్ననలు పొందుతున్నారు నటుడు సోనూసూద్. అదే విధంగా కొవిడ్ సెకండ్ వేవ్‌లోనూ ఇబ్బందులు పడుతున్న అనేక మందికి సహాయన్ని అందించడం సహా వైద్యానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాను చేశారు సోనూ. దీంతో అయన్ని దేవుడిగా కొంతమంది ఆరాధిస్తున్నారు.
శరణార్థుల అపద్బాంధవుడు సోనూసూద్ - సోనూసూద్ ఇంటివద్దకు శరణార్థులు
సహాయం కోసం తన నివాసం వద్దకు వచ్చిన పలువురి శరణార్థులను నటుడు సోనూసూద్ కలిశారు. సాయం కోసం వచ్చిన వారి బాధలను విన్న సోనూ.. త్వరలోనే వారికి అవసరమైన ఏర్పాట్లను చేస్తానని హామీ ఇచ్చారు.
![శరణార్థుల అపద్బాంధవుడు సోనూసూద్ Sonu Sood Spotted Outside His Residence Consoling Visitors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11894792-thumbnail-3x2-hd.jpg)
శరణార్థుల అపద్బాంధవుడు సోనూసూద్!
ఈ నేపథ్యంలో సోనూసూద్‌కు తమ బాధలను చెప్పుకునేందుకు పలువురు ముంబయిలోని ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలను సోనూసూద్ ఓపికగా విన్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లను త్వరలోనే చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి..'అనుకోని అతిథి' ట్రైలర్.. 'గూని బాబ్జీ'గా రావు రమేశ్