లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వలస కార్మికుల క్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 400 పేద కుటంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వలసకార్మికులను ఆదుకుంటానని తెలిపారు.
ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ సహా మిగతా రాష్ట్రాల అధికారులతో సంప్రదించి వారి నుంచి వలస కార్మికుల చిరునామాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించే ప్రక్రియలో ఉన్నారు సోనూ.