కరోనా మహమ్మారి జనాలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పుడు అనేకమంది ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి సమయంలో మీకు ఆక్సిజన్ అందిస్తానని అంటున్నారు ప్రముఖ నటుడు సోనూసూద్(Sonu Sood). కరోనా తెచ్చిన కష్టకాలంలో హీరోగా నిలబడి ఎందరినో ఆదుకుంటున్న ప్రముఖ నటుడు సోనూసూద్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు.
Sonu Sood ఫౌండేషన్.. ఇచ్చట ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితం! - sonu sood foundation
ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు సోనూసూద్(Sonu Sood) మరో అడుగు ముందుకేశారు. ఆక్సిజన్ అవసరమైన వాళ్లు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను(oxygen concentrator) ఉచితంగా అందించనున్నట్లు సోనూ తెలిపారు.
![Sonu Sood ఫౌండేషన్.. ఇచ్చట ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉచితం! Sonu Sood: Oxygen concentrators for free for corona victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11934213-209-11934213-1622208720168.jpg)
సోనూసూద్
ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తూ వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్న వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను(oxygen concentrator) సూద్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యారు. (http://umeedbysonusood.com) ఈ లింక్ ఓపెన్ చేసి రిజిష్టర్ చేసుకున్న వారికి ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తామని సోనూ తెలిపారు. అది కూడా అత్యవసరమైన వారికేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసం డీటీడీసీ కొరియర్స్, తుష్టి ఫౌండేషన్‌తో పాటు మరో రెండు స్వచ్ఛంద సంస్థలతో సోనూ చేతులు కలిపారు.