కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా బాధితులకు వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డాక్టర్లు, నర్సులు ఎంతో సేవ చేస్తున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు సిద్ధమయ్యాడు నటుడు సోనూసూద్. తన హోటల్‌ను వారి కోసం అందుబాటులో ఉంచాడు.
"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది రాత్రనకా పగలనకా పని చేస్తూనే ఉన్నారు. అలాంటి వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. ఇలాంటి నిజమైన హీరోల కోసం నా హోటల్ గదులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి."