వలసకూలీల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్.. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సురేంద్ర రాజన్కు అండగా నిలిచారు. గత మూడు నెలల నుంచి ముంబయిలో చిక్కుకుపోయిన ఇతడ్ని.. తన సొంత ఊరు సత్నాకు జూన్ 18లోపు పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై స్పందించిన సురేంద్ర.. సోనూసూద్ లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని ప్రశంసించారు.
"సోనూసూద్ చేస్తున్న పని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇలా ఎవరైనా చేయగలరా? అనిపించింది. అతడు అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఇలాంటి వారు ఉండటం చాలా అరుదు. ఈ మూడు నెలల్లో నాకు అయిన రూ.45000 ఖర్చును నా శిష్యుల్లో ఒకరు భరించారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు రేషన్ అందించారు" -సురేంద్ర రాజన్, బాలీవుడ్ నటుడు