ఎంతోమందికి తన వంతు సాయం చేస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్.. మరో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. కరోనా లాక్డౌన్ జీవనాధారం కోల్పోయిన దిగువ మధ్యతరగతి వాళ్లకు ఈ-రిక్షాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
వారికి సోనూసూద్ సాయం.. ఉచితంగా ఈ-రిక్షాలు - Sonu Sood 'Pravasi Rojgar' app
ఇప్పటికే ఎన్నో విధాల చాలామందికి సాయం చేస్తున్న సోనూసూద్.. ఉపాధి కోల్పోయిన దిగువ మధ్యతరగతి ప్రజల కోసం కొత్త ఆలోచన చేశారు. వాళ్లకు ఉచితంగా ఈ-రిక్షాలు ఇవ్వాలనుకుంటున్నారు.
వారికి సోనూసూద్ సాయం.. ఉచితంగా ఈ-రిక్షాలు
"రోజువారీ అవసరాల కంటే ఉద్యోగమే ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకే 'కుద్ కమావో ఘర్ చలావో' ద్వారా వారి కాళ్లపై వారు నిలబడేలా చేయడంలో సహాయపడుతున్నాను" అని సోనూసూద్ ప్రకటనలో తెలిపారు.
అంతకు ముందు కూడా 'ప్రవాస్ రోజ్గార్' యాప్ను సోనూ ఆవిష్కరించారు. లాక్డౌన్ ఉద్యోగాలు కోల్పోయిన వారికి.. దీని ద్వారా మళ్లీ ఉపాధి కల్పించారు.