బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు(Sonu Sood IT Survey) కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయపు పన్ను అధికారులు(Sonu Sood IT Raid).. ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబయిలోని ఆయన నివాసంతోపాటు నాగ్‌పుర్, జైపుర్‌లలో ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు.
ఈ సోదాల్లో భారీ మొత్తంలో పన్ను ఎగవేతను అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలీవుడ్ నుంచి తీసుకున్న పేమెంట్లు, సోనూ వ్యక్తిగత ఆదాయంలో ఈ పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలుస్తోంది. సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఐటీ అధికారులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశముంది.
పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సోనూసూద్‌కు(Sonu Sood News) చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు జరిపారు. "లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించాం" అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. గురువారం మరోసారి సోనూ నివాసానికి వెళ్లిన అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా స్థిరాస్తి సంస్థతో(Sonu Sood Real Estate) ఒప్పందం గురించి ప్రశ్నించినట్లు సమాచారం.