తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కపిల్ శర్మ షోలో సోనూసూద్ కన్నీటిపర్యంతం - the kapil sharma show sonusood episode

'కపిల్ శర్మ' టాక్​షోకు ప్రముఖ నటుడు సోనూసూద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వలసకూలీల చెప్పిన మాటలతో కన్నీటిపర్యంతమయ్యారు.

కపిల్ శర్మ షోలో సోనూసూద్ కన్నీటిపర్యంతం
నటుడు సోనూసూద్

By

Published : Aug 1, 2020, 7:39 PM IST

కరోనా ప్రభావంతో దాదాపు 120 రోజుల విరామం తర్వాత 'కపిల్ శర్మ షో' తొలి ఎపిసోడ్.. ఈరోజు(ఆగస్టు 1) రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. అతిథిగా ప్రముఖ నటుడు సోనూసూద్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో వలసకూలీల మాటలకు చలించిపోయిన సోనూ కన్నీటి పర్యంతమయ్యారు.

దీని గురించి ట్వీట్ చేసిన కపిల్ శర్మ.. తొలి ఎపిసోడ్​ను అసలు మిస్సవ్వద్దొని అన్నారు. సోనూసూద్​ను 'ది రియల్ హీరో ఆఫ్ 2020'గా అభివర్ణించారు.

అయితే సోనూ పాజీతో తీసిన ఈ ఎపిసోడ్.. అన్నింటికన్నా ప్రత్యేకమైనదని కపిల్ చెప్పారు. షోలో భాగంగా కొందరు వలసకూలీలతో సోనూ వీడియోకాల్​లో మాట్లాడారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details