నటుడు సోనూసూద్ కరోనా కాలంలో అవసరమైన వారికి సాయం చేస్తూ హీరోగా నిలుస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో కూలీలు తమ స్వగ్రామానికి చేరుకోవడానికి మద్దతుగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికీ తమకు సాయం కావాలని అతడిని సంప్రదిస్తే చాలు.. ఆ పనిని గంటల్లో చేసి పెడుతున్నాడు. తాజాగా ఓ ఊరిలో సెల్ టవర్ వేయించి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు.
చదువు కోసం సెల్ టవర్ ఏర్పాటు చేసిన సోనూసూద్
తన ఉదారతను మరోసారి చాటుకున్నాడు నటుడు సోనూసూద్. ఓ ఊర్లో సిగ్నల్ కోసం మొబైల్ టవర్ నెలకొల్పి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
సెల్ టవర్‌ను నెలకొల్పి ఉదారత చాటుకున్న సోనూసూద్
హరియాణాలోని మొర్ని గ్రామంలో ఓ పిల్లాడు ఆన్లైన్ క్లాస్ వినేందుకు మొబైల్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఆ ఊర్లో సిగ్నల్ సరిగా ఉండదు. దీంతో అతడు ఓ చెట్టెక్కి క్లాస్ వినడాన్ని ఒకరు వీడియో తీసి దానిని ట్విట్టర్ ద్వారా సోనూసూద్‌కు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన సోనూ.. ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి మొబైల్ టవర్‌ను నెలకొల్పాడు. దీంతో ఆ ఊరు ప్రజలతో పాటు నెటిజన్లు సోనూసూద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.