తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆకాశాన్నంటిన నటుడు సోనూసూద్​ కీర్తి - sonu soodh spice jet

కరోనా కష్టకాలంలో వలస కార్మికులు, పేద ప్రజలకు సాయం చేసి దేవుడిగా మారిన నటుడు సోనూసూద్​ను ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్​జెట్​ గౌరవించింది. ఆయన సేవలకు గుర్తుగా తమ బోయింగ్​ 737 విమానంపై సోనూ చిత్రాన్ని చిత్రించింది.

sonu
సోనూ

By

Published : Mar 20, 2021, 2:18 PM IST

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు అరుదైన గౌరవం దక్కింది. లాక్​డౌన్​లో వలస కూలీలకు, పేద ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారతీయ​​ విమానయాన సంస్థ స్పైస్​ జెట్..​ తమ బోయింగ్​ 737 విమానంపై సోనూ ఫొటోను చిత్రించింది. "ఏ సెల్యూట్​ టూ ది సేవియర్​ సోనూసూద్​" అనే వ్యాఖ్య జోడించింది. ఈ గౌరవాన్ని అందుకోవడంపై సోనూ హర్షం వ్యక్తం చేశారు.

లాక్​డౌన్​లో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఎంతో మంది వారి సొంతూళ్లకు చేరుకునేందుకు సోనూ ఎంతగానో కృషి చేశారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసి వారికి అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఇప్పటికీ ఆదుకుంటూనే ఉన్నారు.

సోనూ
సోనూ
సోనూ
సోనూ

ఇదీ చూడండి: ఇంటి విషయంలో సుప్రీంకోర్టుకు సోనూ

ABOUT THE AUTHOR

...view details