వీరు, వారు అనే భేదం లేకుండా దేశవ్యాప్తంగా కష్టాల్లో ఉన్న పలువురిని ఆదుకుంటూ.. రియల్ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఓ జాతీయ స్థాయి మహిళా కరాటే అథ్లెట్కు.. శస్త్రచికిత్స చేయించి ఆదుకున్నారు.
జనవరి నెలలో విజేంద్ర కౌర్ అనే మహిళా కరాటే ఫైటర్ ప్రాక్టీసు చేస్తుండగా మోకాలు విరిగిపోయింది. మళ్లీ మాములు మనిషిగా నడిచేందుకు చాలా డబ్బులు ఖర్చవుతుందని చెప్పారు వైద్యులు. ఆర్థిక స్థోమతలేని ఈ యువతికి బంధువులు కూడా చేయూతగా నిలవలేకపోయారు. దీంతో ఆమె అప్పటినుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. సోనూ గురించి తెలుసుకున్న ఆమె.. ట్విట్టర్ ద్వారా సాయం చేయాలని కోరింది.