లాక్డౌన్లో ఎందరికో సాయపడిన బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్.. మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న నీటి సమస్యను తీర్చారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు.
ఆ ఊరి నీటి సమస్య తీర్చిన సోనూసూద్ - Sonu Sood Jhansi village
ఝాన్సీ గ్రామాన్ని వేధిస్తున్న నీటి సమస్యకు సోనూసూద్ పరిష్కారం చూపారు. చేతి పంపులు ఏర్పాటు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
"ఝాన్సీ గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ ఊరిలోని నీటి సమస్య గురించి నాతో చెప్పారు. నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని, అందువల్ల పిల్లలు, కుటుంబాలు చాలా కష్టాలు పడుతున్నాయని నాతో చెప్పారు. దీంతో ఆ ఊరిలో చేతిపంపుల్ని ఏర్పాటు చేశాం. బోర్ వేస్తున్నప్పుడు ఉరి వాళ్లంతా అక్కడి నిల్చుని చాలా ఆసక్తితో దానిని చూశారు. ఆ విషయం నా మనసును చాలా హత్తుకుంది. ఏదో ఓ రోజు నేను కూడా ఆ పంపు నీళ్లు తాగేందుకు వెళ్తాను. నాకు కూడా అది చాలా ప్రత్యేకమే కదా!" అని సోనూసూద్ చెప్పారు.
ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'ఆచార్య', బాలీవుడ్లో అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్', 'కిసాన్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.