లాక్డౌన్ కాలంలో దేశంలోని వలస కార్మికులకు మద్దతుగా నిలుస్తూ వారి సమస్యల్ని పరిష్కరిస్తున్నాడు నటుడు సోనూసూద్. ఈ సమయంలో అతడి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా సోనూకు సంబంధించిన ఓ పాత జ్ఞాపకం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అతడు 1997లో 24 ఏళ్ల విద్యార్థిగా ఉన్నపుడు తీసుకున్న లోకల్ రైల్వే పాస్.
పాత జ్ఞాపకం చూసి సోనూసూద్ భావోద్వేగం - సోనూ సూద్ ముంబయి టికెట్
వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు చేరుస్తూ మంచి మనసు చాటుకుంటున్నాడు నటుడు సోనూసూద్. ఈ క్రమంలో ఇతడికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా సోనూసూద్‌కు సంబంధించిన ఓ పాత జ్ఞాపకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోనూసూద్ రూ.420 విలువ చేసే లోకల్ పాస్‌ను వాడినట్లు ఓ నెటిజన్ పాస్‌ను ట్వీట్ చేశాడు. ఈ పాస్‌తో సోను రోజూ బోరివలీ నుంచి చర్చ్ గేట్ వరకు ప్రయాణం చేసేవాడని తెలిపాడు. దీనిని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. దీనిని రీట్వీట్ చేస్తూ "జీవితం అనేది పూర్తి వృత్తం"లాంటిదని అన్నాడు సోనూసూద్.
కరోనా లాక్డౌన్ వల్ల స్వరాష్ట్రాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు దన్నుగా నిలుస్తున్నాడు సోనూసూద్. బస్సులు ఏర్పాటు చేసి వారిని సొంతూళ్లకు పంపిస్తున్నాడు. ప్రతి ఒక్క కూలీ ఇంటికి చేరేవరకు ఈ పని కొనసాగిస్తానని చెబుతున్నాడు.