ప్రముఖ నటుడు సోనూసూద్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి సరోజ్‌సూద్ జయంతి సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఆమె మరణంతో శూన్యత ఆవరించిందని, ఆమె నేర్పిన జీవిత పాఠాలు తనకెంతో ఉపయోగపడ్డాయని అన్నారు.
తన తల్లి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసిన సోనూ.. 'నీ మరణంతో ఆవరించిన శూన్యం, మళ్లీ నిన్ను కలిసేవరకు అలానే ఉంటుంది. నువ్వు ఎక్కడున్న సరే ఆనందంగా ఉంటూ, నాకు సూచనలిస్తావని అనుకుంటున్నాను. లవ్ యూ మా' అని చెప్పారు.
సోనూసూద్ సొంత గ్రామం అయిన పంజాబ్ మోగాలోని ఓ రోడ్‌కు.. ఆయన తల్లి పేరు పెట్టారు. ఆమె యుక్త వయసులో ఇంటి నుంచి కాలేజ్‌కు ఆ రోడ్లోనే వెళ్లేవారని, ఇప్పుడు ఆమె పేరు అదే రోడ్డుకు పెట్టడం ఆనందంగా ఉందని సోనూ గతంలో అన్నారు.
గతేడాది కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతోమంది ప్రజలకు సాయం చేసి, వారి మనసుల్లో చోటు సంపాదించారు సోనూసూద్. ఆ తర్వాత కూడా నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులకు తనవంతు సహాయం చేస్తూ వస్తున్నారు.
ఇవీ చదవండి: