తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముంబయి పోలీసులకు సోనూసూద్ 'మాస్క్​' సాయం - సోనూసూద్ వార్తలు

మరోసారి మంచిమనసు చాటుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ముంబయి పోలీసులకు భారీసంఖ్యలో మాస్క్​లు ఇచ్చారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హోంమంత్రి ట్వీట్ చేశారు.

ముంబయి పోలీసులకు సోనూసూద్ 'మాస్క్​' సాయం
నటుడు సోనూసూద్

By

Published : Jul 17, 2020, 11:13 AM IST

లాక్​డౌన్ ప్రారంభం నుంచి వలసకూలీలు, పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను వారి స్వస్థలాలకు చేర్చిన బాలీవుడ్​ నటుడు సోనూసూద్.. ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ముంబయి పోలీసులకు 25 వేల మాస్క్​లు వితరణ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్.. సోనూకు కృతజ్ఞతలు చెప్పారు.

ప్రతిగా స్పందించిన సోనూ.. "మన నిజమైన హీరోలు పోలీసులు. వారు చేస్తున్న పనికి నేను చేస్తున్న చాలా చిన్న సహాయం ఇది. జైహింద్" అని రాసుకొచ్చారు.

ఇటీవలే మాట్లాడిన సోనూ.. వలసకూలీలకు సహాయం చేసేలా నన్ను ప్రేరేపించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఎంతోమంది కొత్త స్నేహితులు ఏర్పడ్డారని, అనుబంధాలు పెరిగాయని పేర్కొన్నారు. తన లాక్​డౌన్​ అనుభవాలు అన్నింటినీ కలిపి త్వరలో పుస్తక రూపమిస్తానని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details