ప్రముఖ నటుడు సోనూసూద్.. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి ఎన్నో విధాలుగా సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. పేద విద్యార్ధులకూ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇటీవల, ఐఏఎస్ పరీక్షలకు శిక్షణ తీసుకునే వారికోసం స్కాలర్షిప్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఇప్పుడు సీఏ విద్యను ఉచితంగా అందజేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈరోజు (జులై 1) 'సీఏ దినోత్సవం' సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇందుకోసం soodcharityfoundation.org వెబ్సైట్లోకి లాగిన్ అయి వివరాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Sonu Sood: సోనూసూద్ గొప్ప మనసు.. ఉచితంగా సీఏ విద్య
లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దేశంలో చాలామంది సమస్యలు తీర్చుతూ గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్. ఇప్పుడు సీఏ చదవాలన్న కోరిక ఉన్న వారికి ఉచితంగా విద్య అందించనున్నట్లు తెలిపారు.
సోనూసూద్
ఓవైపు తనకు తోచిన సాయం చేస్తున్న సోనూసూద్.. మరోవైపు పలు భాషల్లోని సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లో కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోగానూ రెండు, మూడు చిత్రాలకు అంగీకారం తెలిపారు.
ఇవీ చదవండి: