కష్టం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇప్పుడు మరోసారి దాతృత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి, ఆరు నెలలుగా మోకాళ్ల సమస్యతో బాధపడుతున్న 22 ఏళ్ల యువతికి.. శ్రస్త్రచికిత్స చేయించి ఆదుకున్నారు.
అయినా వాళ్లు అండగా లేకపోయినా..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రజ్ఞ న్యాయవిద్యను అభ్యసిస్తుంది. ఆరు నెలల క్రితం ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో తన రెండు మోకాళ్లు చితికిపోయాయి. స్థానిక వైద్యులు శస్త్రచికిత్స చేయాలని.. అందుకు రూ.1.5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆర్థిక స్థోమతలేని ఈ యువతికి బంధువులు కూడా చేయూతగా నిలవలేకపోయారు. దీంతో ఆమె అప్పటినుంచి చక్రాల కుర్చీకే పరిమితమైంది. సోనూ గురించి తెలుసుకున్న ఆమె.. ఆగస్టు తొలి వారంలో ట్విట్టర్ ద్వారా తనకు సాయం చేయాలని కోరింది.