కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని ప్రముఖ నటుడు సోనూసూద్ కోరారు. కొవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేస్తోన్న ఆయన ఓ వీడియో షేర్ చేశారు. దేశంలో నానాటికీ విజృంభిస్తోన్న కరోనా వల్ల ఎంతోమంది చనిపోతున్నారని.. దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ పిల్లలకు ఉచిత విద్య అందించండి: సోనూసూద్ - Sonu Sood free education
కొవిడ్‌తో మరణించిన వారి పిల్లలకు ప్రభుత్వం సాయం చేయాలని సోనూసూద్ అన్నారు. అలానే ఆ చిన్నారులకు ఉచిత విద్య అందించాలని కోరారు.
సోనూసూద్
'ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు వయసున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. అలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. కాబట్టి ఆ చిన్నారులకు అండగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సంబంధిత ఎన్జీవోలను కోరుతున్నాను. అలాగే, ప్రాథమిక స్కూల్ నుంచి కళాశాల వరకూ వాళ్లకు ఉచిత విద్య అందించాలని అభ్యర్థిస్తున్నాను' అని సోనూ విజ్ఞప్తి చేశారు.
Last Updated : Apr 30, 2021, 2:45 PM IST