బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్.. మోదీ రాసిన పద్యాలకు స్వరాన్ని అందించారు. 'మోదీ-జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్' అంటూ రూపొందుతున్న వెబ్ సిరీస్లో ఈ పాటలను వాడుతున్నారు. 'షామ్ కే రోగన్ రేలే..'పేరుతో సలీమ్, సులేమాన్ ద్వయం సంగీతాన్ని అందించారు. ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించారు.
నరేంద్ర మోదీ పద్యాలకు సోనూ గాత్రం - సలీమ్, సులేమాన్
ప్రధాని మోదీ పద్యాలు పాటల రూపంలో రానున్నాయి. ఆ గీతాలకు గాత్రం అందించారు బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్. రచనలను ఓ వెబ్ సిరీస్లో ఉపయోగించనున్నారు.
నరేంద్ర మోదీ పద్యాలకు సోనూ గాత్రం
"మోదీ రాసిన పది పద్యాలను వాడుకోవడానికి జూన్ నెలలో లేఖ రాశాం. ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి లభించింది. వీటిని పది సిరీస్లలో ఒక్కొక్కటి వాడుకుంటాం".
-- ఉమేశ్ శుక్లా, దర్శకుడు
ప్రతి సిరీస్ చివరన ఈ పద్యాలను ఉంచుతామని స్పష్టం చేశారు శుక్లా. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్లో విడుదల చేస్తామని వెల్లడించారు.