అల్లు అర్జున్ కొత్త చిత్రం 'అల.. వైకుంఠపురములో' ఓ సాంగ్ విడుదలైంది. 'సామజవరగమన..' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ గీతానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'సామజవరగమన.. నిను చూసి ఆగగలనా' అంటూ సాగుతున్న ఈ గేయం శ్రోతల్ని అలరిస్తోంది.