ఇటీవలే లండన్ నుంచి తిరిగొచ్చిన హీరోయిన్ సోనమ్ కపూర్.. అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లైవ్లో ముచ్చటించింది. దిల్లీ విమానశ్రయంలో కరోనా స్క్రీనింగ్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను మెచ్చకుంది. తన ప్రెగ్నెన్సీ విషయంలో వస్తున్న వార్తలపైనా స్పందించింది.
ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్టులను సోనమ్ ఒప్పుకోలేదు. దీంతో ఈమె తల్లి కాబోతుందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ విషయంపై స్పందించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతానికి తను ప్రెగ్నెంట్ కాదని, ఒకవేళ అలా జరిగితే తప్పకుండా చెబుతానంది.