'పెళ్లి అయితే జీవితం మన చేతిలో ఉండదు.. బాధ్యతలు వస్తాయి.. ఇంతకు ముందులా ఆనందంగా గడపలేం' అని చాలామంది అంటుంటారు. అయితే బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌కు మాత్రం పెళ్లికి ముందు కంటే తర్వాతే జీవితం బాగుందంట. ఆనంద్ ఆహుజా లాంటి భర్త దొరకడం తన అదృష్టమని చెబుతుందీ కథానాయిక.
"పెళ్లికి ముందు నా జీవితంలోకి కొత్త ఆనందం వచ్చి చేరింది. ఆనంద్ ఆహుజా లాంటి వ్యక్తి భర్తగా దొరకడం నాకు దక్కిన వరం. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. ఇంతకుముందు కంటే ఆనంద్‌ను ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇద్దరు ఒకరి పనికి ఒకరు విలువనిస్తాం. ఎంత తీరిక లేకుండా ఉన్నా ఇద్దరి కోసం సమయం కేటాయించుకుంటాం. ప్రతి విషయాన్ని పంచుకుంటాం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకున్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడే ఆ దాంపత్యజీవనం బాగుంటుంది. ఆ రెండూ మా మధ్య ఉన్నాయి"