తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అనుచిత వ్యాఖ్యలపై సోనమ్ కపూర్​​ ఆగ్రహం - సోనమ్​ కపూర్​

సోషల్ ​మీడియాలో తనకు ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకతపై స్పందించింది బాలీవుడ్​ నటి సోనమ్ కపూర్​. తన కామెంట్​ సెక్షన్​లో కొందరు పోస్ట్​ చేసిన అనుచిత వ్యాఖ్యలను చూపిస్తూ తాజాగా ఓ ట్వీట్​ చేసింది.

Sonam Kapoor to trolls: My privilege not an insult
అనుచిత వ్యాఖ్యలపై సోనమ్ కపూర్​​ ఆగ్రహం

By

Published : Jun 21, 2020, 9:26 PM IST

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సోషల్ ​మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అతని మరణానికి బాలీవుడ్​లో ఉన్న పలువురు నటీనటులు కారణమని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్​ స్టార్​ నటులు నెటిజన్ల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు.

సోషల్ ​మీడియాలో తీవ్ర నెగెటివిటీ ఎదురైన కారణంగా ట్విట్టర్​ ఖాతాను మూసేస్తున్నట్లు సోనాక్షి సిన్హా, సాకిబ్​ సలీమ్​లు ఇప్పటికేప్రకటించారు. ఇదే రీతిలో నటి సోనమ్​ కపూర్​కు పూర్తి వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో స్పందించింది సోనమ్​.

"నాకు ఎదురైన కొన్ని కామెంట్స్​ ఇవి. కొన్ని మీడియాలు ఈ విధమైన ప్రవర్తనను ప్రేరేపిస్తున్నాయి. ప్రజలు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు. ఒకరిపై దయ చూపమని అంటున్న ప్రజలే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నా కామెంట్​ సెక్షన్​ చూడండి. అలాంటి వ్యాఖ్యలు ఎదుర్కోవాలని మీరు అనుకోరు. ఇలాంటి ప్రవర్తనను మీ తల్లిదండ్రులు కూడా చూడకూడదు అని అనుకుంటున్నా."

- సోనమ్​ కపూర్​, బాలీవుడ్​ నటి

సోనమ్​ కపూర్​.. తన సిబ్బందితో కలిసి ఆమె కామెంట్​ సెక్షన్​లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సోషల్​మీడియాలో రిపోర్టు చేసింది. ఫాదర్స్​ డే సందర్భంగా తన తండ్రి అనిల్​ కపూర్​కు శుభాకాంక్షలు తెలుపుతూ..స్టార్​ నటుడి కుమార్తెగా తనకున్న హక్కును ప్రస్తావిస్తూ, ఆమెకు అది గర్వకారణమని ట్విట్టర్​లో తెలిపింది.

ఇదీ చూడండి...ట్విట్టర్​కు హీరోయిన్ సోనాక్షి సిన్హా గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details