తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తన భర్తపై కామెంట్​ చేసిన మహిళకు సోనమ్​ కౌంటర్​ - సోనమ్​ కపూర్ న్యూస్​

అమెరికాకు చెందిన ఓ మహిళ సోనమ్ కపూర్​ భర్త అందంగా ఉండడని సోషల్​ మీడియా వేదికగా కామెంట్​ చేసింది. దీనిపై స్పందించిన సోనమ్​.. ఫాలోవర్స్​ను పెంచుకోవడం కోసం ఇలాంటి చీప్​ ట్రిక్స్​ వాడుతున్నారంటూ విరుచుకుపడింది.

Sonam
సోనమ్

By

Published : Sep 19, 2020, 12:00 PM IST

తన భర్త అందంగా ఉండడని కామెంట్‌ చేసిన అమెరికన్‌ సోషల్‌ మీడియా ఇన్ఫుఎన్సర్​కు బాలీవుడ్​ హీరోయిన్​ సోనమ్‌ కపూర్‌ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఫాలోవర్స్‌‌ను పెంచుకోవడం కోసం ఈ ట్రిక్కు వాడుతున్నావంటూ మండిపడింది. ప్రేమను పంచమని, ద్వేషాన్ని కాదని సదరు మహిళ పెట్టిన సందేశాలు షేర్‌ చేసింది.

"నువ్వు ఈ మెసేజ్‌ చదవవని నాకు తెలుసు. నువ్వు తప్పుడు ఆరోపణల గురించి, మహిళా సాధికారిత గురించి మాత్రమే మాట్లాడుతావు. నీలాంటి మహిళ సమాజంలో నెగిటివిటీని వ్యాప్తి చేస్తుంది. మీ నాన్న లేకపోతే నువ్వు శూన్యం. నీ లాంటి నటీమణులకు భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ప్రాధాన్యం ఇవ్వకపోవడం సంతోషంగా ఉంది. నీకు కనీసం నటించడం కూడా రాదు. పూర్తిగా బంధుప్రీతి నుంచి వచ్చిన నటివి నీవు. మరో విషయం.. నీ భర్త చాలా బాగుంటాడని నువ్వు అనుకుంటున్నావా? మరోసారి ఆయన్ను చూడు ఎంత అందవిహీనంగా ఉన్నారో తెలుస్తుంది" అని మహిళ వ్యాఖ్యానించింది.

దీనికి సోనమ్‌ రిప్లై ఇస్తూ.. "దీని ద్వారా ఫాలోవర్స్‌ను సంపాదించాలి అనుకున్నావు. నా దృష్టిలో పడటానికి నువ్వు ఇలాంటి సందేశం పంపావని నాకు తెలుసు. ఈ మహిళ నాకు నీచమైన మాటలు పంపింది. ప్రజల మొదళ్లు ఇలా పనిచేస్తున్నాయేంటి? ఆమె వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యనికి గురి చేశాయి, ఎంతో బాధించాయి. ఇంత ద్వేషాన్ని మనసులో ఉంచుకుంటే అది వారినే నాశనం చేస్తుంది. ఈ సందేశాలు పంపడానికి మరో కారణం కూడా ఉంది. ఇలా మాట్లాడితే ఆమెను ట్యాగ్‌ చేస్తానని, దాని ద్వారా ఫాలోవర్స్‌ను పెంచుకుందామని అనుకుంది" అని పేర్కొంది.

అనంతరం సదరు మహిళ (అమెరికన్‌ ఇన్ఫుఎన్సర్)‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా హ్యాక్‌ అయ్యిందని తెలిపింది. "నా నుంచి విద్వేషపూరితమైన సందేశాలు వచ్చి ఉంటే.. అవి నేను చేసినవి కావు. నా ఖాతాను హ్యాక్‌ చేశారు. ఇప్పుడే తిరిగి నా ఆధీనంలోకి వచ్చింది. నేనెప్పుడూ ద్వేషంతో కూడిన సందేశాల్ని పంపను, పంపలేదు" అని చెప్పింది. సోనమ్‌ ప్రస్తుతం తన భర్తతో కలిసి లండన్‌లో ఉంటోంది. 2018 మే 8న ముంబయిలో వీరి వివాహం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details