విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ జంటగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ 'ఎఫ్ 2'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ఎఫ్ 3' రూపొందుతోంది. సునీల్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించింది నటి సోనాల్ చౌహాన్. ఇలాంటి కామెడీ రోలర్ కాస్టర్ రైడ్‌లో తానూ భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది.
'ఎనిమీ' రిలీజ్ డేట్.. 'ఎఫ్ 3'లో బాలయ్య భామ - నవంబర్ 4న ఎనిమీ రిలీజ్ ట
టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'ఎఫ్ 3', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'ఎనిమీ' సినిమాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.
విశాల్, ఆర్య కాంబోలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఎనిమీ'. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళిని రవి హీరోయిన్గా కనిపించనుంది.
అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే ప్రధాన పాత్రల్లో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఇటీవలే విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి నిర్మాత అల్లు అరవింద్, హీరోహీరోయిన్లు అఖిల్, పూజా హెగ్డే, దర్శకుడు భాస్కర్‌తో పాటు పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.