'లెజెండ్', 'పండగ చేస్కో', 'రూలర్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉత్తరాది అందం సోనాల్ చౌహాన్. ప్రస్తుతం ఆమె 'ఎఫ్3' సినిమాలో నటిస్తోంది. ఇప్పుడీ అమ్మడు తెలుగులో మరో క్రేజీ అవకాశం అందిపుచ్చుకున్నట్లు తెలిసింది.
Nagarjuna the ghost movie: ప్రస్తుతం నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో 'ది ఘోస్ట్' అనే చిత్రం రూపొందుతోంది. నారాయణదాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో.. కథానాయికగా తొలుత కాజల్‌ను ఎంపిక చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొంది. దీంతో ఆ పాత్ర కోసం అమలాపాల్, జాక్వెలిన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపించింది. ఇప్పుడీ పాత్రను సోనాల్ చౌహాన్ దక్కించుకుందని సమాచారం.