విరాళాల గురించి బయటకు ప్రకటించడం.. ప్రకటించకపోవడం అనేది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పింది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలో నానాటికీ విజృంభిస్తోన్న తరుణంలో దాని కట్టడి కోసం ఎంతో శ్రమిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి పలువురు సినీ ప్రముఖులు తమవంతు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు తారలు తమకు తోచినంత ఆర్థిక విరాళాలను పీఎం కేర్స్ ఫండ్‌కు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాళాలను అందచేయని సినీతారలను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్న వారిలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా ఉంది. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా ట్విట్టర్లో స్పందించిందీ హీరోయిన్.
'విరాళం ఇవ్వటం.. ఇవ్వకపోవటమనేది నా ఇష్టం' - సోనాక్షి సిన్హా కొత్త సినిమా అప్డేట్
కరోనాపై పోరాటంలో పలువురు సినీప్రముఖులు మద్దతుగా నిలుస్తూ.. ప్రధానమంత్రి సహాయనిధికి విరాళాలను ప్రకటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి ఆర్థిక సహాయాలు చేయని వారిని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేస్తూ విమర్శిస్తున్నారు. దీనిపై బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పందించింది.
'విరాళం ఇవ్వటం.. ఇవ్వకపోవటమనేది నా ఇష్టం'
"నేను ఎలాంటి విరాళాన్ని ప్రకటించలేదని పలువురు నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్‌పై నేనెంతో మౌనంగా వ్యవహరించాను. మంచి చేయండి కానీ దాని గురించి మర్చిపోండి అనే మంచిమాటను గుర్తుపెట్టుకోండి. మీరు మీ సమయాన్ని నిజమైన మంచి పనులు చేసేందుకు ఉపయోగించండి. విరాళాలను బయటకు ప్రకటించడం లేదా ప్రకటించకపోవడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతం" అని సోనాక్షి వెల్లడించింది.
ఇదీ చూడండి.. అభిమానుల మదిని దోచేస్తోన్న అందాల రాశి