తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోనాక్షిని వేధించిన సైబర్ నేరగాడు దొరికేశాడు - సోనాక్షి తాజా వార్తలు

కథానాయిక సోనాక్షి సిన్హాపై ఆన్​లైన్​ బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని ముంబయి సైబర్​ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాలాన్ని సురక్షితంగా మార్చడంలో, మహిళలకు భద్రత కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు.

sonakshi
సోనాక్షి

By

Published : Aug 21, 2020, 10:26 PM IST

బాలీవుడ్​ నటి సోనాక్షి సిన్హాను సైబర్​ బెదిరింపులకు గురి చేసి, అభ్యంతరకర భాషను ఉపయోగించిన యువకుడిని ముంబయి సైబర్​ క్రైమ్ పోలీసుల విభాగం అరెస్టు చేసింది. తన సమస్యపై సత్వర చర్యలు తీసుకున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది సోనాక్షి.

"ఈ విషయంలో అండగా నిలబడినందుకు ముంబయి సైబర్​ క్రైమ్​ బ్రాంచ్​కు నా కృతజ్ఞతలు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడానికే ఈ విషయం వెల్లడించాను. తద్వారా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతరులు కూడా ధైర్యంతో ముందడుగు వేస్తారు. అబ్​ బస్​(ఇక చాలు) ఆన్​లైన్​ దుర్వినియోగాన్ని చూస్తూ మేం అసలు ఊరుకోం"

సోనాక్షి సిన్హా, సినీ నటి

మహిళలపై ఆన్​లైన్​ వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో సైబర్​ సెక్యూరిటీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మిషన్ జోష్​ సహకారంతో 'అబ్​ బస్'​ అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది సోనాక్షి. ఈ క్రమంలోనే వేధింపులకు గురైన వారికి వీలైనంత సాయం చేసే ప్రచారంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది.

అసలేం జరిగిందంటే?

ఇటీవలే సోనాక్షి ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆన్​లైన్​ వేధింపులకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. అయితే కొంతమంది వినియోగదారులు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే సోనాక్షి బృందం సైబర్​ పోలీసులను ఆశ్రయించింది.

విచారణలో ఔరంగబాద్​కు చెందిన శశికాంత్​ జాదవ్​(27) నిందితుడిగా తేలాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. జాదవ్​ సోనాక్షిని మాత్రమే కాకుండా.. చాలామంది నటీనటులపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతర్జాలాన్ని సురక్షిత ప్రదేశంగా మార్చడంలో సైబర్ పోలీసులు కీలక పాత్ర వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details