తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సోనాక్షి.. పాఠశాలకు వెళ్లి చదువుకో' - I Love Memes': Sonakshi Sinha

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. 'కౌన్ బనేగా కరోడ్​పతి' షోలో ఓ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడమే ఇందుకు కారణం.

సోనాక్షి

By

Published : Sep 22, 2019, 8:39 AM IST

Updated : Oct 1, 2019, 1:15 PM IST

బాలీవుడ్​ నటి సోనాక్షి సిన్హా సామాజిక మాధ్యమాల్లో హాట్​ టాపిక్​గా మారింది. నెటిజన్ల ఆగ్రహానికి గురయింది. 'కౌన్ బనేగా కరోడ్​పతి' షోలో రామాయణం గురించి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడమే ఇందుకు కారణం.

తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'కౌన్ బనేగా కరోడ్​పతి' షోలో పాల్గొంది సోనాక్షి. రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ పోటీదారునికి మద్దతుగా ఆమె వచ్చింది. ఈ సందర్భంగా అమితాబ్​.. "హనుమంతుడు సంజీవని మూలికను ఎవరి కోసం తీసుకొచ్చారు." అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుగ్రీవుడు, లక్ష్మణుడు, సీత, రాముడు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సోనాక్షి తికమకపడి.. హెల్ప్​లైన్ తీసుకుంది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

సోనాక్షిపై ట్రోల్స్

"ఇంటి పేరు రామాయణం. తండ్రి పేరు శత్రుఘ్న. సోదరులు లవ,కుశ. కానీ సంజీవని గురించి తెలియని సోనాక్షి.." అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "ఇంత సులభమైన ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయావా," "సోనాక్షి.. మళ్లీ పాఠశాలకు వెళ్లి చదువుకో," "నువ్వు నటి కావడం ఆశ్చర్యంగా ఉంది," "మీకంటే మీరు మద్దతుగా నిలిచిన పోటీదారునికే ఎక్కువ పరిజ్ఞానం ఉన్నట్లుంది," "కనీస పరిజ్ఞానం లేని నువ్వు మిషన్ మంగళ్​లో శాస్త్రవేత్తగా ఎలా నటించావు." అంటూ కామెంట్లు పెట్టారు.. మీమ్స్​ రూపొందించారు నెటిజన్లు.

సోనాక్షిపై ట్రోల్స్

విమర్శలపై సోనాక్షి స్పందించింది. "నాకు పైథాగరస్ సిద్ధాంతం, మర్చంట్ ఆఫ్ వెనిస్, ఆవర్తన పట్టిక, మొఘల్ వంశ చరిత్ర, కూడా గుర్తు లేదు. మీరు చాలా ఖాళీగా ఉన్నారు. వీటిపైనా మీమ్స్ చేయండి ప్లీజ్. నాకు మీమ్స్ అంటే చాలా ఇష్టం." అంటూ కామెంట్స్​ను లైట్​గా తీసుకుంది.

సోనాక్షి ట్వీట్
సోనాక్షిపై ట్రోల్స్
సోనాక్షిపై ట్రోల్స్
సోనాక్షిపై ట్రోల్స్
సోనాక్షిపై ట్రోల్స్

ఇవీ చూడండి.. దసరా పండక్కి బాలయ్య అదిరిపోయే సర్​ప్రైజ్​..!

Last Updated : Oct 1, 2019, 1:15 PM IST

ABOUT THE AUTHOR

...view details