తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇండో-పాక్ యుద్ధంలో సోనాక్షి.. ఫస్ట్​లుక్​ అదరహో - సోనాక్షి సిన్హా వార్తలు

సోనాక్షి సిన్హా హీరోయిన్​గా తెరకెక్కిన చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. తాజాగా ఈ సినిమా నుంచి సోనాక్షి లుక్​ విడుదల చేసింది చిత్రబృందం.

ఇండో-పాక్ యుద్ధంలో సోనాక్షి.. ఫస్ట్​లుక్​ అదరహో
ఇండో-పాక్ యుద్ధంలో సోనాక్షి.. ఫస్ట్​లుక్​ అదరహో

By

Published : Jul 17, 2020, 9:16 PM IST

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించిన చిత్రం 'భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్‌ ఇండియా'. ఈ చిత్రంలో సామాజిక కార్యకర్తగా కనిపించనుంది సోనాక్షి. తాజాగా సినిమాకు సంబంధించిన సోనాక్షి పాత్రను పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్​ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. హీరో అజయ్ ‌దేవగణ్‌ ట్విట్టర్లో ఈ పోస్టర్​ను షేర్‌ చేశారు.

"భారత సైన్యానికి మద్దతుగా 299 మంది మహిళలను తనతో పాటు తీసుకెళ్లిన ధైర్యమైన సామాజిక కార్యకర్త సుందర్‌బెన్ జేతా మధర్‌పర్యగా సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్ ఇది. చరిత్ర నుంచి ఒక కీలకమైన సంఘటన త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ప్రేక్షకుల ముందుకు రానుంది" అంటూ రాసుకొచ్చారు అజయ్.

ఈ చిత్రం హైదరాబాద్, కచ్, భోపాల్, కోల్‌కత్తాలో షూటింగ్‌ జరుపుకొంది. సోనాక్షి ఇందులో గుజరాత్‌కు చెందిన సామాజిక కార్యకర్త సుందర్‌బెన్ జేతా మాధర్‌పర్యగా కనిపించనుంది. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత సైన్యాన్ని ఆదుకునే ప్రయత్నంలో 299 మంది మహిళలకు నాయకత్వం వహించే పాత్ర ఇది.

అభిషేక్ దుధయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్, అమ్మీ విర్క్, నోరా ఫతేహి, ప్రణీతా సుభాష్‌ తదితరులు నటించారు.

ABOUT THE AUTHOR

...view details