తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'30 కిలోల బరువు తగ్గినా సరే అవమానించారు' - sonakshi sinha news

'దబంగ్' కోసం 30 కిలోల బరువు తగ్గానని చెప్పిన నటి సోనాక్షి.. అయినప్పటికీ అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. ఇప్పటికీ తన బరువు గురించే మాట్లాడుకుంటున్నారని పేర్కొంది.

'30 కిలోల బరువు తగ్గినా సరే అవమానించారు'
నటి సోనాక్షి సిన్హా

By

Published : Jul 5, 2020, 9:42 PM IST

శతృఘ్న సిన్హా వారసురాలిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనాక్షి సిన్హా. 2010లో సల్మాన్‌ఖాన్‌ బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ 'దబంగ్‌'తో ఆరంగేట్రం చేసింది. మొదట్లో లావుగా ఉండే ఈ భామ.. ఈ సినిమా కోసం 30 కిలోల బరువు తగ్గింది. ఇందులో బొద్దుగా.. అందంగా కనిపించి కుర్రాళ్ల మనసును కొల్లగొట్టింది. కానీ, సినిమాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా తన శరీరాకృతిపై అవమానాలు ఎదుర్కొన్నానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

"చిన్నతనంలో నేను 95 కిలోలు ఉండేదాన్ని. స్కూల్‌లో అందరూ నా శరీర బరువు చూసి ఎగతాళి చేసేవాళ్లు. కానీ అవేవి నేను పట్టించుకోలేదు. నన్ను నేను తక్కువ చేసుకోలేదు. ఎందుకంటే నా బరువు, నా సైజు మించి నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి. దబంగ్‌ సినిమా కోసం బరువు తగ్గడం నేను సాధించిన ఓ ఘనతగా భావిస్తా. ఆ విషయంలో గర్వపడతా. కానీ ఇప్పటికీ ప్రజలు నా శరీర బరువు గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా వాటిని పట్టించుకోవద్దని నాకు నేను సర్ది చెప్పుకుంటా. ఎందుకంటే ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చానో వారికి తెలియదు కదా! చివరగా.. చెప్పాలంటే నా శరీర బరువు గురించి వారు ఏం ఆలోచిస్తున్నారో నాకు అనవసరం. వాళ్లేమీ నాలాగా బాలీవుడ్‌లో నటించే వ్యక్తులు కాదు" అని సోనాక్షి చెప్పుకొచ్చింది.

సోనాక్షి సిన్హా.. సల్మాన్‌ఖాన్‌తో 'దబంగ్‌' సిరీస్‌తో పాటు రౌడీ రాథోడ్‌, లూటెరా, ఆర్. రాజ్‌కుమార్‌, నూర్‌ లాంటి చిత్రాల్లో నటించింది. అజయ్ దేవగణ్​తో కలిసి ఆమె నటించిన 'భుజ్‌'.. త్వరలో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details