తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్యతో నేను నటించడం లేదు: సోనాక్షి - తెలుగు బాలకృష్ణ సినిమా వార్తలు

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్​లో మరో కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కథానాయిక అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిందీ ముద్దుగుమ్మ.

sonakshi sinha said about her movie with balakrishna
బాలయ్యతో నేను నటించడం లేదు: సోనాక్షి

By

Published : Dec 17, 2019, 10:03 AM IST

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా నటిస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. అయితే ఇందులో తాను నటించడంలేదని తెలిపిందీ ముద్దుగుమ్మ.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నేను హీరోయిన్‌ అని వచ్చిన వార్తల్లో నిజం లేదు. నేను అందులో నటించడం లేదు. త్వరలోనే నా తర్వాతి ప్రాజెక్టు గురించి చెప్తాను.

సోనాక్షి సిన్హా, సినీ నటి

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'రూలర్'. ఈ సినిమాలో వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. జయసుధ, భూమిక, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. డిసెంబరు 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: అమితాబ్..​ రాజకీయాల్లోకి వెళ్లొద్దన్నారు: రజనీకాంత్

ABOUT THE AUTHOR

...view details