తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవ్వులు పూయిస్తున్న 'సెక్సాలజిస్ట్' బేబీ - సోనాక్షి సిన్హా

'ఖాన్​దానీ సఫాఖానా' సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సోనాక్షి సిన్హా.. ఇందులో సెక్సాలజిస్ట్ పాత్రలో కనిపించనుంది.

నవ్వులు పూయిస్తున్న సెక్సాలజిస్ట్ బేబీ

By

Published : Jun 23, 2019, 11:59 AM IST

బాలీవుడ్​ హీరోయిన్​ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఖాన్‌దానీ సఫాఖానా: సెక్స్‌ క్లినిక్‌’. ఇందులో బేబీ అనే యువతి పాత్రలో నటిస్తోంది. ఆమెకు ఓ బంధువు ద్వారా సెక్స్‌ క్లినిక్‌ వారసత్వ ఆస్తిగా వస్తుంది. అది అమ్మాలంటే ఆరు నెలలు స్వయంగా నడపాలన్న షరతు ఉంటుంది. సెక్సాలజిస్ట్‌గా రంగంలోకి దిగిన బేబీకి క్లినిక్‌కు వచ్చే వారి నుంచి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఈ చిత్ర కథ.

భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడరు చాలామంది. ఈ విషయంపై సున్నిత హాస్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ నవ్వులు పూయిస్తోంది. ప్రముఖ పాప్‌ గాయకుడు బాద్‌షా కీలక పాత్రలో నటించాడు. శిల్పి దాస్‌ గుప్తా దర్శకుడు. వచ్చే నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవే కాకుండా సల్మాన్‌ ఖాన్‌తో ‘దబాంగ్‌ 3’, అక్షయ్‌ కుమార్‌తో ‘మిషన్‌ మంగళ్‌’లో నటిస్తోంది.

ఇది చదవండి: 'రూ.1000తో వేల మంది దాహం తీర్చండి' అంటున్న సోనాక్షి సిన్హా

ABOUT THE AUTHOR

...view details